Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భారతమాతా కీ జై'' అంటోన్న ''సైరా''.. రోమాలు నిక్కబొడుచుకునే (ట్రైలర్)

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (18:27 IST)
మెగాఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సైరా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన ఫ్యాన్సుకు ఈ ట్రైలర్ బిగ్ ట్రీట్ ఇచ్చింది. భారతమాతా కీ జై అంటూ మొదలైంది ట్రైలర్. ఖైదీ నెం 150 తర్వాత ఒకటి రెండు కాదు.. రెండున్నర ఏళ్లుగా సైరా కోసం కష్టపడుతూనే ఉన్నారు చిరంజీవి. 
 
ట్రైలర్ అంతా ఎమోషనల్ జర్నీగా తీర్చిదిద్దాడు సురేందర్ రెడ్డి. ముఖ్యంగా ఉయ్యాలవాడ జీవిత చరిత్రను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సైరా మేకింగ్ వీడియో విడుదలకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. 
 
టీజర్ కూడా అలాగే హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా మరో స్థాయిలో ఉండటంతో కచ్చితంగా సైరా సంచలనం సృష్టించడం ఖాయమని చెప్తున్నారు మెగా ఫ్యాన్స్. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇందులో ప్రతీ క్యారెక్టర్ హైలైట్‌గా వుంటుంది.


విజువల్ వండర్‌గా ఈ ట్రైలర్ అదరగొట్టేసింది. ముఖ్యంగా చిరంజీవి లుక్ ఈ ట్రైలర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR Is The Trump of Telangana: ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణకు ట్రంప్‌లా వుండేవాడు..

Uppada: ఉప్పాడ భూమిని మింగేసిన సముద్రం- పవన్ కల్యాణ్ ఒత్తిడి వల్లే?

డిసెంబరు నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి : సీఎం చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు డిప్యూటీ సీఎం పవన్ ఘాటు కౌంటర్

నగరం లోపల నగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments