Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో "సైరా" దూకుడు... డాలర్ల వర్షం

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (10:25 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా నరసింహా రెడ్డి" చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం స్వదేశంలోనేకాకుండా, విదేశాల్లో సైతం సూపర్ టాక్‌తో దూసుకెళుతోంది.
 
ముఖ్యంగా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సైరా దూకుడు ప్రదర్శిస్తోంది. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. ట్రేడ్ వ‌ర్గాల ప్ర‌కారం అమెరికాలో మంగ‌ళ‌వారం 308 లొకేష‌న్స్‌లో ప్ర‌ద‌ర్శించిన ప్రీమియ‌ర్స్‌లో 8,57,765 డాల‌ర్ల(6.16 కోట్ల రూపాయ‌లు)ను రాబ‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. 
 
అదేవిధంగా ఆస్ట్రేలియాలోనూ ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 39 లొకేష‌న్స్‌లో 1,89,237 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్స్‌ను సాధించిన‌ట్లు పేర్కొంటున్నారు. బుధ‌వారం ఒక్క రోజే ఈ చిత్రం అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసినట్టు సమాచారం. 
 
కాగా, ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటించగా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విక్రయానికి బ్రిటిష్ ఎఫ్-35 బి : ఓఎల్ఎక్స్‌లో సేల్స్ పోస్టర్ వైరల్

డబ్బు కోసం సొంత నగ్న వీడియోల స్ట్రీమింగ్ చేస్తున్న జంట.. ఎక్కడ?

విమానం ఇంజిన్‌లో మంటలు... టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే...

మాట మార్చిన డోనాల్డ్ ట్రంప్ - ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం!!

Divvela Madhuri: ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక.. లంగా వోణిలో దివ్వెల మాధురి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments