Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సీతాయణం'' కోసం శ్వేతా మోహన్.. ఊపిరి తీసుకోకుండా పాడింది..!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (15:10 IST)
Seethayanam
అక్షిత్‌ శశికుమార్‌, అనహిత భూషణ్‌ జంటగా నటిస్తున్న సినిమా 'సీతాయణం'. ప్రభాకర్‌ ఆరిపాక దర్శకుడు. పద్మనాభ్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని 'మనసు పలికే నీ మాటనే..' అనే గీతాన్ని ప్రముఖ గాయని శ్వేతా మోహన్‌ పాడారు. ఊపిరి తీసుకోకుండా చరణం పాడి, శభాష్‌ అనిపించుకున్నారు. 
 
ఈ సందర్భంగా శ్వేతా మోహన్‌ మాట్లాడుతూ.. 'సీతాయణం' సినిమాకు పద్మనాభ్‌ భరద్వాజ్‌ అద్భుతమైన బాణీలు అందించారు. ఈ చిత్రం కోసం కన్నడ, తెలుగులో చక్కటి సెమీ క్లాసికల్‌ గీతం పాడాను. బ్రీత్‌లెస్‌ చరణం పాడటం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పటికే ఎంతో మంది బ్రీత్‌ లెస్‌ సాంగ్స్‌ పాడారు. కానీ నాకు ఇది తొలి అనుభవం. ఈ అవకాశమిచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
 
కాగా.. 1985లో నేపథ్య గాయని సుజాతా మోహన్‌, కృష్ణ మోహన్‌ దంపతులకు శ్వేతా మోహన్‌ జన్మించారు. అక్కడే పెరిగిన ఆమె చెన్నైలోని స్టెల్లా మారిస్‌ కళాశాలలో గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గత కొన్నేళ్లుగా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 583 గీతాలు పాడటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments