Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎపుడో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 24 ఆగస్టు 2025 (22:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ చిత్రం ఓజీ. (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి రెండో పాటను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. "సువ్వి సువ్వి" అనే బాణీలో సాగే ఈ పాటను ఆగస్టు 27వ తేదీ ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు డీవీవీ మూవీస్ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేసింది. 
 
తుపాను తర్వాత ప్రశాంతత వస్తుంది అనే ఆసక్తికర క్యాప్షన్‌తో ఈ ప్రకటన చేయడంతో పాట ఎలా ఉండబోతుందనే దానిపై అంచనాలు పెరిగాయి. సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అన్నీ యాక్షన్‌తో నిండివుండగా, రెండో పాట మాత్రం పూర్తి భిన్నంగా మెలోడీ ప్రధానంగా ఉండబోతుందనే ఈ క్యాప్షన్ ద్వారా చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. సువ్వి సువ్వి అనే టైటిల్ కూడా ఇది ఒక ఫ్యామిలీ లేదా మెలోడీ సాంగ్ అయివుండొచ్చని అంచనాలను బలపరుస్తుంది. సంగీత దర్శకుడు థమన్ ఈ గ్యాంగ్ స్టర్ చిత్రానికి సంగీతం ఎలా అందించారోనని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 
 
కాగా, ఈ చిత్రంలో పవన్ సరసన ప్రయాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మీ కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 25వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments