Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత‌గా సుశ్మిత కొణిద‌ల మ‌రో సినిమా

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (19:23 IST)
Sushmita
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత మ‌రోసారి నిర్మాత‌గా మార‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆమెకు సినీరంగంలో ప‌లు రంగాల‌పై ప‌ట్టు సాధించారు. ఆమె ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. జై చిరంజీవ సినిమాకు తొలిసారిగా ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ప‌నిచేశారు. ఇక ఆ త‌ర్వాత చిరంజీవి న‌టించిన `ఖైదీనెం. 150`, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఆమె నిర్మాత‌గా శ్రీ‌కాంత్‌తో `షూట్ అవుట్ ఆలేరు` అనే వెబ్ సిరీస్ నిర్మించారు.
 
తాజా స‌మాచారం మేర‌కు సుశ్మిత ఓ సినిమా నిర్మాణం చేయ‌బోతోంది. ఆమె స్వంత బేన‌ర్ అయిన గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత‌గా మారుతుంది. త‌మిళ సినిమా `ఎట్టుతొట్ట‌క‌ళ్లం` అనే సినిమాను తెలుగులో తీయ‌బోతుంది. ఇందులో `ఏక్ మినీ క‌థ‌` హీరో సంతోష్ శోభ‌న్ న‌టించ‌నున్నాడు. ఆయ‌న ప‌క్క‌న త‌మిళ సినిమా `96` ఫేమ్ గౌరీ న‌టించ‌నుంది. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు శ్రీ‌గ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments