Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ఆత్మహత్య.. రియా అక్కడే వున్నదట.. డ్రాప్ కూడా చేశాడట!

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (12:39 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజు రోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ అనుమానాస్పద మృతి తరువాత రియా డ్రగ్స్ బాగోతం బయటికి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఈ కోణంలో విచారణ చేపట్టింది. సుశాంత్ మరణానికి ముందు అతని ఇంట్లో పార్టీ జరిగినట్టు ఓ జాతీయ మీడియా సంచలన విషయాల్ని బయటపెట్టింది.
 
లాక్‌డౌన్ సమయంలో సుశాంత్‌తో కలిసి రియా వుందన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. జూన్ 8న తాను సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయానని గతంలో తెలిపింది. కానీ ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రియా జూన్ 13న అంటే సుశాంత్ మృతి చెందిన రోజు వరకు అక్కడే వుందని, సుశాంత్ స్వయంగా రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అర్థరాత్రి ఆమెని డ్రాప్ చేశాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో రియా కావాలనే అబద్ధం చెబుతోందని తేలిపోయింది. దీంతో సీబీఐ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
 
అంతే కాకుండా సుశంత్ మృతి కేసులో సిద్ధార్ధ్ పితానీని కూడా సీబీఐ మరోసారి విచారణకు పిలవబోతోందట. సుశాంత్ మృతి చెందిన రోజు సిద్ధార్ధ్ పితాని ఇంట్లోనే వున్నారట. ఆ కారణంగా అతన్ని ప్రత్యక్ష సాక్షిగా పరిగణించి మరో సారి అతన్ని విచారించబోతున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

Snake: గురుకులం పాఠశాలలో పాము కాటు ఘటనలు.. ఖాళీ చేస్తోన్న విద్యార్థులు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం