Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య42.చిత్రానికి కంగువ అనే టైటిల్‌ను ప్రకటన

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:21 IST)
surya 42 movie
సూర్య, దిశా పటాని, యోగి బాబు  ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి  నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ సూర్య 42 చిత్రానికి 'కంగువ' అనే టైటిల్‌ను ప్రకటించింది. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి మరియు అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం  . 3డిలో 10 భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషలకు ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ప్రకటించారు.
 
ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతో పాటు పలు లొకేషన్లలో జరుగుతోంది. ఇప్ప‌టికే 50 శాతం పూర్త‌య్యింది. మ‌రో నెల‌లో బ్యాల‌న్స్ షూటింగ్ పూర్తి చేయ‌నున్నారు.
 
3Dలో ఈ యాక్షన్ మూవీ వివిధ అవతారాలలో  మోస్ట్ పవర్ఫుల్ గా  అన్ని వర్గాల  ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు, అధిక స్థాయిలో విఎఫ్ఎక్స్, CGI  వర్క్ ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తారు.
 
ఈ టైటిల్‌పై దర్శకుడు శివ మాట్లాడుతూ.. 'సూర్య 42వ చిత్రం కంగువ అనే టైటిల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉంది. సూర్య చాల  గంభీరంగా తెరపై కనిపిస్తాడు. ఇది మాకు గుర్తుండిపోయే, ప్రత్యేకమైనది. సినిమా ప్రేమికులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, విడుదల తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం' అని చెప్పారు.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ కె.ఇ. యువి క్రియేషన్స్ వంశీ-ప్రమోద్‌తో కలిసి జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments