Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు.. ఎవరు..?

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (20:28 IST)
owl
గుడ్లగూబ పక్షిని అపశకునంగా, దురదృష్టానికి సంకేతంగా కూడా భావిస్తారు. అయితే అలాంటి పక్షిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు నిర్మాత, నటుడు సూర్యతేజ్‌. శుక్రవారం హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్‌ పార్కును ఆయన సందర్శించాడు. 
 
అనంతరం జూపార్క్‌లోని గుడ్లగూబను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన రూ.20వేల చెక్‌ను జూపార్క్‌ క్యూరేటర్‌ రాజశేఖర్‌కు అందించాడు.
 
ఈ సందర్భంగా సూర్యతేజ్‌ మాట్లాడుతూ నెహ్రూ జులాజికల్‌ పార్కును సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో మరుపురాని విషయాల్లో ఇది కూడా ఒకటని తెలిపాడు.
 
హైదరాబాద్‌ నగరం ఎన్నో మూగజీవాలకు నిలయంగా ఉందని, నెహ్రూ పార్క్‌ నిర్వహణ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. అనంతరం జూపార్క్‌ క్యూరేటర్‌ రాజశేఖర్‌ మాట్లాడూతూ సూర్యతేజ లాగే మరికొంత మంది హీరోలు, సామాన్యులు జంతువులు, పక్షుల దత్తత కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments