Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

డీవీ
శుక్రవారం, 5 జులై 2024 (10:45 IST)
Surya-kanguva
'కంగువ' నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా 'కంగువ' సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
 
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రెస్టీజియస్ మువీ 'కంగువ'ను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తుండటంతో మరింత ఎగ్జైట్ మెంట్ ఏర్పడుతోంది.
 
'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
 
నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments