Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు చేసేది నట‌న కాద‌ని క్లాస్ పీకారు: రానా

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (22:34 IST)
Rana Daggubati
సూర్య న‌టించిన‌ యాక్షన్ థ్రిల్లర్ `ఇటి` (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది. 
 
ఈ సంద‌ర్భంగా గురువారం రాత్రి సూర్య ఇటీ (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లాలో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ, నేను సూర్య‌గారి`పితామ‌గ‌న్‌` సినిమా నుంచి అభిమాని అయ్యా. అప్ప‌ట్లో నేనెవ‌రో తెలీదు. ఆయ‌నెవ‌రో పెద్ద‌గా నాకూ తెలీదు. ఆ త‌ర్వాత ప‌దేళ్ళ‌నాడు సూర్య‌గారు నేను చేసిన ఓ సినిమాను ఎడిటింగ్‌లో చూశారు.


ఆ త‌ర్వాత న‌న్ను కారు ఎక్కించుకుని సిటీ అంతా తిప్పుతూ.. నువ్వు చేసేది న‌ట‌న‌ కాదంటూ క్లాస్ పీకారు. అలా ఆ క్లాస్ పీక‌బ‌ట్టే నేను మెరుగుద‌ల అయ్యాన‌నుకుంటా. ఆ జ‌ర్నీ బ‌ళ్ళాల‌దేవ వ‌ర‌కు వ‌చ్చేలా చేసింది. ఇక మా క‌ట్ట‌ప్పతో (స‌త్య‌రాజ్‌)తో ఐదేళ్ళ‌నుంచి సినిమా చేశాం. ఇక పాండ్య‌రాజ్‌కు శుభాకాంక్ష‌లు. పెద్ద విజ‌యం ఇ.టి. కి ద‌క్కాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments