Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్ అడ్వెంచర్ గా సూర్య 45 మూవీ, AR రెహమాన్ సంగీతం

డీవీ
మంగళవారం, 15 అక్టోబరు 2024 (08:47 IST)
Suriya
జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ 'సూర్య 45'ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ యొక్క మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మూకుతి అమ్మన్, వీట్ల విశేషం వంటి హిలేరియస్, సోషల్ రెస్పాన్సబులిటీ కలిగిన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీ ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
 
RJ బాలాజీ ప్రస్తుతం సూర్య 45 ప్రీ-ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఎక్సయిటింగ్ స్క్రిప్ట్‌పై ఒక సంవత్సరానికి పైగా పని చేస్తున్న ఆయన, ఈ పక్కా ఎంటర్‌టైనర్ కోసం లొకేషన్‌లను ఖరారు చేయడానికి రెక్సీ కోసం అనేక ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
 
అకాడమీ అవార్డ్-విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రెహమాన్, సూర్య ఇంతకుముందు సిల్లును ఒరు కాదల్, ఆయుధ ఎళుతు, '24' వంటి క్లాసిక్ చిత్రాలలో కలిసి పనిచేశారు. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్- కంపోజర్ కాంబో పని చేస్తున్న ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ ట్రీట్ గా వుండబోతోంది.
 
RJ బాలాజీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నటీనటులు, టెక్నిషియన్స్ ని ఎంపిక చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని 2024 నవంబర్ లో సెట్స్‌పైకి తీసుకువెళ్లి 2025 సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments