Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 26న "S3-య‌ముడు-3" విడుద‌ల‌

వినూత్న‌మైన క‌థాంశాల‌తో పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య, శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్త

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:18 IST)
వినూత్న‌మైన క‌థాంశాల‌తో పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య, శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలో 'య‌ముడు', 'సింగం' చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు ఆదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత‌ మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌ల‌ై సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పోందుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వ‌రి 26వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో త‌న న‌ట‌న‌తో, త‌న‌కంటూ ప్ర‌త్యేఖ అభిమానుల్ని సంపాయించుకున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందిన య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం "S3-య‌ముడు-3". డైర‌క్ట‌ర్ హ‌రి గారు ఈ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే‌తో థ్రిల్‌ని క‌లిగించేలా స‌న్నివేశాల‌తో చిత్రం కొన‌సాగుతుంది. తెలుగు ప్రేక్ష‌కుల్లో హ‌రి స్క్రీన్‌ప్లే‌కి కూడా ఫ్యాన్స్ ఉండ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్ చూసి ప్రేక్ష‌కుల అంచానాలు పెరిగాయి. వారి అంచ‌నాలు అందుకునేలా మా చిత్రం ఉండ‌బోతుంది. సూర్య ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌గా యాక్ష‌న్‌లో మ‌రోక్క‌సారి విజ్రంబించారు. 
 
అనుష్క న‌ట‌న‌కి ఈసారి శ్రుతిహ‌స‌న్ గ్లామ‌ర్ అడిష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్ష‌న్‌లో మా సంస్థ పార్ట‌యినందుకు చాలా అనందంగా వుంది. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియో‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జ‌న‌వ‌రి 26వ తేదీన మా బ్యాన‌ర్ ద్వారా తెలుగు వెర్ష‌న్‌ని విడుద‌ల‌ చేస్తున్నాము. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు అని చెప్పారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments