Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ స్పీచ్: షూటింగ్ ఆపేసి చూసిన చిరంజీవి.. తమ్ముడు మాత్రం?

ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్, ఫ్యాన్స్ గొడవ, జనసేన పార్టీ ఆవిర్భావం వంటి అంశాలపై తిరుపతిలో ఏర్పాటైన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్, ఫ్యాన్స్ గొడవ, జనసేన పార్టీ ఆవిర్భావం వంటి అంశాలపై తిరుపతిలో ఏర్పాటైన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఏకిపారేశారు. అలాగే ఎంపీలపై కూడా సీరియస్ అయ్యారు.

పవన్ స్పీచ్‌ను ఆద్యంతం చాలామంది టీవీలో ఆసక్తిగా వీక్షించారు. ఇదే తరహాలో మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి కూడా తమ్ముడు ప్రసంగాన్ని విన్నారు. 
 
చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా గడుపుతున్నప్పటికీ.. పవన్ స్పీచ్‌ ప్రారంభం కాగానే చిరంజీవి షూటింగ్‌ను ఆపేశారు. షూటింగ్ మధ్యలో ఆపేయించి అక్కడే ఓ టీవీని ఏర్పాటు చేయించుకుని తమ్ముడు మాట్లాడిన స్పీచ్ లైవ్ మొత్తం ఆసక్తిగా వీక్షించారట.

స్పీచ్ అయిపోగానే ఎవరితో ఏమి మాట్లాడకుండా మళ్లీ షూటింగ్ కొనసాగించినట్లు తెలిసింది. కాగా మెగాఫామిలీలో జరిగే ఎలాంటి కార్యక్రమాలకు సమయం కేటాయించని పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లో ఉన్నా ప్రత్యక్షంగా తమ్ముడి స్పీచ్‌ను చూడటం గొప్ప విషయమని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments