Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (14:52 IST)
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య, పూజా హగ్డేలు జంటగా నటించిన తాజా చిత్రం "రెట్రో". ఈ చిత్రం మే నెల ఒకటో తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొని అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. 
 
"ఒక చిన్న హెచ్చరిక.. నేను కేవలం సినిమా అవసరం కోసం సిగరెట్లు కాల్చాను. దయచేసి మీ నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి" అని స్పష్టం చేసారు. పొగతాగడం ఒకసారి మొదలుపెడితే సులభంగా వదిలించుకోలేని వ్యసనంగా మారుతుందన్నారు. ఒక్క పఫ్ లేదా ఒక్క సిగరెట్‌తో మొదలుపెడతారు. కానీ ప్రారంభించాక దాన్ని ఆపడం చాలా కష్టం. నేను దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహించను. మీరు కూడా చేయకండి అని హితవు పలికారు. 
 
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తాను గతంలో చేసిన 45 చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. కార్తీక్‌తో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments