రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రం లాల్ సలాం. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
మీతో సినిమా చేయటం ఓ అద్భుతం. నాన్నా.. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు... లాల్ సలాంలో మొయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అని ఆమె పేర్కొన్నారు. రజినీకాంత్ సహా ఎంటైర్ యూనిట్ కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ మా బ్యానర్‌లో రజినీకాంత్‌గారు నటించటం మాకెప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే వెంటనే చేస్తానని అన్నారు. ఆయన్ని ఓ పవర్ఫుల్ పాత్రలో చూడబోతున్నారు. ఐశ్వర్యా రజనీకాంత్‌గారు పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ మూవీలో రజినీకాంత్‌గారి పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు.త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేస్తాం అన్నారు.
భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చిత్రాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. రీసెంట్‌గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించి సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ లాల్ సలాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ఇండియన్ 2, అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న మిషన్ చాప్టర్ 1, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం విడా ముయర్చి , 2018 వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించి దర్శకుడు జూడ్ ఆంథని జోసెఫ్ దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రం.. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని కూడా లైకా ప్రొడక్షన్స్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది.