Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీకి కన్నడ సంఘాలు రెడ్ సిగ్నల్.. అయినా టాప్‌లో నిలిచింది..

ఐటీ నగరమైన బెంగళూరులో డిసెంబర్‌ 31న జరిగే కొత్త సంవత్సరాది వేడుకల్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్‌ పాల్గొనాల్సిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (12:06 IST)
ఐటీ నగరమైన బెంగళూరులో డిసెంబర్‌ 31న జరిగే కొత్త సంవత్సరాది వేడుకల్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్‌ పాల్గొనాల్సిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ)తో పాటు పలు కన్నడ సంఘాలు సన్నీలియోన్ బెంగళూరులో అడుగుపెడితే తీవ్ర పరిణామాలుంటాయని.. సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతామని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఇంకా ఇలాంటి కొత్త సంవత్సరాది వేడుకలకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశించడం జరిగిందని.. కన్నడ సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఈవెంట్‌ నిర్వాహకులు చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
కాగా సన్నీలియోన్‌కు కన్నడ సంఘాలు రెడ్ సిగ్నల్ ఇచ్చినా.. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధిక మంది శోధించిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్‌లో సన్నీ లియోన్‌ పేరును అత్యధిక మంది శోధిస్తున్నారు. దీంతో ఆమె పేరిట ఓ రికార్డు నమోదైంది. తద్వారా గూగుల్‌లో అత్యధికులు శోధించిన వ్యక్తుల జాబితాలో సన్నీ టాప్‌లో నిలిచింది. 
 
ఇక మరో బాలీవుడ్ భామ దిశా పటానీ ఈ జాబితాలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక బాహుబలిలో భల్లాలదేవుడిగా నటించి గుర్తింపు సంపాదించిన రానా గూగుల్‌లో అత్యధికులు శోధించిన వ్యక్తుల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments