Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్‌స్టార్ కదా అపుడు ఏ మగాడు ముట్టుకోలేదు : సన్నీ లియోన్

బాలీవుడ్ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనను ప్రతి ఒక్కరూ పోర్న్‌స్టార్‌గానే చూశారనీ, అందువల్ల నా చేయి పట్టుకునే ఏ ఒక్క మగాడు ఇష్టపడలేదని నటి సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. కానీ, బాలీవుడ్ నటుడు చ

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:15 IST)
బాలీవుడ్ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనను ప్రతి ఒక్కరూ పోర్న్‌స్టార్‌గానే చూశారనీ, అందువల్ల నా చేయి పట్టుకునే ఏ ఒక్క మగాడు ఇష్టపడలేదని నటి సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. కానీ, బాలీవుడ్ నటుడు చుంకీ పాండే మాత్రం నా చేయి పట్టుకుని స్టేజ్ మీదకు తీసుకెళ్లాడని, అందుకే అతనంటే తనకు ఎంతో మర్యాద అని చెప్పారు. 
 
తాజాగా బాలీవుడ్ నటి నేహా దూపియాతో కలిసి సన్నీ లియోన్ ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత పాల్గొని తొలి అవార్డు షో గురించి చెప్పుకొచ్చింది. అప్పుడు ఆర్గ‌నైజ‌ర్లు త‌న‌ను స్టేజ్‌పైకి ర‌మ్మ‌ని ఆహ్వానించారనీ, అయితే, త‌న‌తోపాటు ఎవ‌రైన యాక్ట‌ర్‌ను తీసుకురావాల‌ని కోరారు. 
 
అయితే త‌న‌తో స్టేజ్‌పైకి రావ‌డానికి ఏ ఒక్క హీరో లేదా మగాడు ఇష్ట‌ప‌డ‌లేద‌ని స‌న్నీ వాపోయింది. ఏ న‌టి, న‌టుడు కూడా రాక‌పోవ‌డంతో తాను చాలాసేపు అలాగే ఆగిపోయాన‌ని, చివ‌రికి ఓ వ్య‌క్తి మాత్రం త‌న చేయి అందించాడ‌ని చెప్పింది. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. న‌టుడు చుంకీ పాండే. అందుకే ఇప్ప‌టికీ అత‌నంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని తెలిపింది. 
 
కాగా, సన్నీ లియోన్ ఇపుడు బాలీవుడ్‌లో పెద్ద స్టార్. ఎప్పుడైతే స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పార్టిసిపేట్ చేసిందో.. అప్ప‌టి నుంచీ ఆమె పేరు ఇండియ‌న్ ఆడియెన్స్‌కు తెలిసొచ్చింది. మ‌హేష్ భ‌ట్ త‌న సినిమాలో చాన్స్ ఇవ్వ‌డంతో స‌న్నీ ద‌శ తిరిగిపోయింది. అయితే ఆమె గ‌తంలో ఓ పోర్న్ స్టార్‌. ఇదే మొద‌ట్లో ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి ఎన్నో అవ‌మానాల‌కు కూడా గురైన‌ట్లు స‌న్నీ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం