Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్ హీరోగా 'ఉంగరాల రాంబాబు'.. ప్రచార రథం ప్రారంభం

ఇటీవలే 'జ‌క్క‌న్న'తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్‌తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, "ఓనమాలు" వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" వంటి కమ

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (16:17 IST)
ఇటీవలే 'జ‌క్క‌న్న'తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్‌తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, "ఓనమాలు" వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి "ఉంగరాల రాంబాబు" అనే క్యాచీ టైటిల్‌ను ఖరారు చేశారు. రథసప్తమి సందర్భంగా ఈ చిత్ర ప్రచార రథాన్ని సంస్థ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్‌పై 'ఉంగరాల రాంబాబు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న 'ఉంగరాల రాంబాబు' చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్‌లో వుంటుంది. 
 
సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్‌తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... 'మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ ఉంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ను అందిచబోతున్నారు. సునీల్ పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్‌గా త‌న కామెడితో జ‌క్క‌న్న చిత్రాన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యాన్ని త‌న ఖాతాలో జ‌మ‌చేసుకున్నాడు. ఈ చిత్రంలో త‌న క్యారెక్టరైజేషన్‌ను విభిన్నంగా మలిచారు. కథ, కథనాలకు తగ్గట్టుగా ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను నిర్ణయించాం. రథ సప్తమి సందర్భంగా మా చిత్ర ప్రచారాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చిదిద్దారు.  
 
అద్భుతమైన సినిమాటోగ్రాఫర్స్ సర్వేశ్ మురారి, శ్యామ్ కె నాయుడు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. 90 శాతం చిత్రీకరణ పూర్తైంది. త్వరలోనే గ్రాండ్‌గా ఆడియో లాంచ్ నిర్వహించబోతున్నాం. వేసవి కానుకగా 'ఉంగరాల రాంబాబు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments