Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా జులై 29న సునీల్‌ 'జ‌క్క‌న్న' విడుద‌ల

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్‌గా, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ త‌ర్వాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం 'జక్కన్న' షూటింగ్ కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (16:30 IST)
సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్‌గా, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ త‌ర్వాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం 'జక్కన్న' షూటింగ్ కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఇప్ప‌టికే పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఆడియోని మెగాస్టార్ చిరంజీవి చేతుల‌మీదుగా విడుద‌లైన ఆడియో సూప‌ర్ హిట్ కావ‌టం ఆనందంగా వుంది.
 
థియోట్రిక‌ల్ ట్రైల‌ర్‌‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ బ్యాక్ టు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌గా నిల‌వ‌టం ఈ చిత్రం క్రేజ్‌ని తెలియ‌జేస్తుంది. పంచ్ డైలాగ్స్ ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ర‌క్ష చిత్రం ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. దినేష్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై 29 విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నారు.
 
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సునీల్ నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా జ‌క్క‌న్న చిత్రం. సునీల్ కామెడీ టైమింగ్‌కి డైర‌క్ట‌ర్ వంశి రాసిన సీన్‌కి థియోట‌ర్స్‌లో క్లాప్స్ ప‌డ‌తాయి. అదేవిధంగా దినేష్ అందించిన ఆడియో కూడా ఫుల్ ఎన‌ర్జిగా ఉంటాయి. సునిల్ బ్యాక్ టు ఎంట‌ర్టైన్మెంట్ అని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ్వ‌టం చాలా హ్య‌పీగా వుంది. మా చిత్రంలో అన్ని పాట‌లు పాడుకునేలా వుంటాయి. 
 
ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. మా డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ కొత్త‌ పాయింట్‌ని ఎంటర్ టైనింగ్‌గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఎట్టిప‌రిస్ధితిలో మా చిత్రాన్ని జులై 29న‌ విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తామని తెలిపారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments