Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మళ్ళీ మొదలైంది’లో సుమంత్ మోస్ట్ క‌న్‌ఫ్యూజ్డ్ డివోర్సి

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:08 IST)
Sumanth ph
హీరో సుమంత్ తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టి.జి.కీర్తి కుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాలో వెడ్డింగ్ కార్డ్ లీక్ కావ‌డంతో మూవీ ల‌వ‌ర్స్ అందరిలో ఓ అటెన్ష‌న్ క్రియేట్ అయ్యింది. త‌ర్వాత సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న సుహాసిని, వెన్నెల కిషోర్ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం హీరో సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
 
పోస్ట‌ర్‌లో హీరో సుశాంత్ లుక్ చాలా క్లాస్‌గా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. అయితే పొగ‌డ‌రి అయిన మ‌న హీరో సినిమాలో క‌న్‌ఫ్యూజింగ్‌గా ఉంటాడు. పెళ్లంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దు. అత‌ని రిలేష‌న్ షిప్ స్టేట‌స్ కూడా అంద‌రికీ క్వ‌శ్చ‌న్ మార్క్‌లా ఉంటుంది. ఒంటరిగా ఉంటాడు. చ‌క్క‌గా వంట వండుతాడు. `మోస్ట్ క‌న్‌ఫ్యూజ్డ్ డివోర్సి` అనే లైన్ ఉన్న పోస్ట‌ర్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
 
‘మళ్ళీ మొదలైంది’  చిత్రంలో పెళ్లి, విడిపోవ‌డం అనే అంశాల‌పై ఓ సందిగ్ధ‌త నెల‌కొన్న యువ‌కుడిగా సుశాంత్ క‌నిపిస్తారు. ఆయ‌న‌కు జోడీగా నైనా  గంగూలీ న‌టించింది. రెడ్ సినిమాస్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments