Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యాన్స్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ చేస్తాడు, ఆర్టిస్ట్‌ యాక్ట్‌ చేస్తాడు మరి నీపనేంటి.. దర్శకుడి భార్య సందేహం

పజిల్ అల్లి దాన్ని పూరించి బయటపడేలా సినిమాలు తీయడం హాలీవుడ్ దర్శకుల అలవాటు. మనకు సుకుమార్ రూపంలో అలాంటి దర్శకుడు దొరికారు. కానీ సినిమా కళలోని అన్ని విభాగాల వారు రోజంతా కష్టపడుతుంటే తానేం చేసేది ఏంటి అనే సందేహం తనకే కలుగుతూ ఉంటుందట. అందరూ వారి పని వార

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (05:26 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మేధస్సుతో పనిచేసే అరుదైన దర్శకుడుగా సుకుమార్‌కు ఎంతో పేరుంది. జనతాగ్యారేజ్, కుమారి 21F వంటి సినిమాలు ఆయన టేకింగ్ ఎంత బాగుంటుందో చెబుతాయి. పజిల్ అల్లి దాన్ని పూరించి బయటపడేలా సినిమాలు తీయడం హాలీవుడ్ దర్శకుల అలవాటు. మనకు సుకుమార్ రూపంలో అలాంటి దర్శకుడు దొరికారు. కానీ సినిమా కళలోని అన్ని విభాగాల వారు రోజంతా కష్టపడుతుంటే తానేం చేసేది ఏంటి అనే సందేహం తనకే కలుగుతూ ఉంటుందట. అందరూ వారి పని వారు చేసుకుంటారు కదా. మరి దర్సకుడిగా నువ్వు చేసే పనేంటి అని సినీరంగం గురించి ఏమీ తెలీని తన భార్య అడుగుతుంటే తనకే ఆ డౌట్ వచ్చిందట. దాంతో ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయాడట. ఏం జరిగిందీ తన మాటల్లోనే విందాం.
 
 ఫస్ట్‌లో తనకు సినిమాల గురించి ఏం తెలీదు. ఆమెది హైదరాబాద్‌. ఎక్కువ హిందీ సినిమాలు చూసేది. నా సిన్మాలు చూడలేదు. ‘డైరెక్షన్‌ అంటే నువ్వేం చేస్తావ్‌’ అనడిగింది. తన డౌట్‌ ఏంటంటే... ‘డ్యాన్స్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ చేస్తాడు, ఆర్టిస్ట్‌ యాక్ట్‌ చేస్తాడు, ఇలా అందరూ అన్నీ చేస్తే నువ్వేం చేస్తావ్‌’ అంది. ఆర్టిస్టులకు ఎలా చేయాలో చెబుతానన్నా. ‘అల్లు అర్జున్‌కు చెబుతావా నువ్వు బన్నీ ఆ మాత్రం చేయలేడా నువ్వు చెప్పేదేంటి!’ అంది. 
 
కొన్నాళ్లు తనది ఇన్నోసెన్సా మరొకటా అర్థం కాలేదు. సెట్‌లో కూడా అప్పుడప్పుడూ అందరూ తమ తమ పనులు చేసేస్తుంటే... ‘ఇక్కడ నా జాబ్‌ ఏంటి’ అనే భయం వేస్తుంది. వాళ్లు సరిగ్గా చేసినా, ఏదొకటి మార్పులు చెబుతాం. చివరకు, ఎడిటింగ్‌లో వాళ్లు చేసిందే పెట్టుకుంటాం.
 
మా ఆవిడతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు తను రెండు డ్రస్సులు చూపిస్తే.. ‘బాగున్నాయి, రెండూ తీసుకో’ అన్నా. అలాంటి నేను ఓసారి తమన్నా కాస్ట్యూమ్‌ బాగోలేదని రెండు గంటలు ‘100% లవ్‌’ షూటింగ్‌ ఆపేశా. కాస్ట్యూమ్స్‌ తెప్పించి వెతుకుతుంటే, వెనుక మా ఆవిడ ఉంది. ‘హీరోయిన్‌ కోసం ఇంత టైమ్‌ కేటాయించావ్‌. నాకోసం లేదు’ అని అలిగింది. ఆమెను బుజ్జగించడానికి కొంచెం టైమ్‌ పట్టింది
 
నిజమే కదా. మరి అందరూ వారివారి పనులు చేసుకుపోతుంటే  దర్శకుడు చేసేదేమిటి? అదేదో సినిమాలో రావు రమేష్ అన్నట్లు పిసుక్కోవడం తప్పిస్తే.. పైగా అల్లు అర్జున్‌కు చెబుతావా నువ్వు బన్నీ ఆ మాత్రం చేయలేడా.. ఈ మాట భార్య అన్నాక సుకుమార్‌కి కచ్చితంగా ఆ రాత్రి నిద్రపట్టి ఉండదు గాక ఉండదు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh: ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025: రెండో స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments