Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుడిగాలి సుధీర్ `గాలోడు`

Webdunia
బుధవారం, 19 మే 2021 (15:56 IST)
Sudigali Sudhir
సుడిగాలి సుధీర్ హీరోగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సూప‌ర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంభినేష‌న్‌లో ఒక ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ప్రారంభ‌మైంది. మే19 హీరో సుడిగాలి సుధీర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి `గాలోడు` అనే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. క్యాచీ టైటిల్‌తో పాటు ఇన్నోవేటివ్‌గా ఉన్న ఈ మోష‌న్‌పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంస్కృతి ఫిలింస్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించనున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ, మాస్‌లో సుడిగాలి సుధీర్‌కి ఎంత ఇమేజ్ ఉందో చెప్ప‌డానికి మా సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రానికి వ‌చ్చిన భారీ ఓపెనింగ్స్ నిద‌ర్శ‌నం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్నిభారీ ఎత్తున రూపొందిస్తున్నాం. ఈ రోజు సుధీర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా `గాలోడు` అనే టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. ఈ మూవీకి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం``అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments