Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్.ను వ‌దిలేస్తున్న సుడిగాలి సుధీర్, రేష్మి- కార‌ణం అదేనా?

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (19:15 IST)
Sudheer, Reshmi,
జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపుల‌ర్ అయిన న‌టుడు సుడిగాలి సుధీర్ ఇక‌పై త‌ప్పుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించిన వార్త స్టూడియోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. నాన‌క్‌రామ్ గూడాలో ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేసిన సెట్లో షూట్ జ‌రుగుతోంది. ఈ షోవ‌ల్ల కొత్త‌త‌రం న‌టుడు ప‌రిచ‌యం అయ్యారు. వారంతా సినిమాల్లోనూ అవ‌కాశాలు ద‌క్కాయి. ఆ త‌ర్వాత ప‌లు ప్రోగ్రామ్‌ల‌కు విదేశాల‌కూ వెళ్ళారు. తాజాగా సుధీర్‌కు రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి. అంత‌కుముందు ఓ సినిమా చేశాడు. ప‌ర్వాలేదు అనిపించేలా వుంది కానీ పెద్ద‌గా హిట్ కాలేదు.
 
ప్ర‌స్తుతం తాజా స‌మాచారం ప్ర‌కారం సుడిగాలి సుధీర్‌, రేష్మి లు వైవాహిక జీవితంలో ప్ర‌వేశిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నా దానికి ఇంకా స‌మ‌యం వుంద‌ని మాత్ర‌మే వారు చెబుతున్నారు. అయితే వారు జంట‌గా సినిమా చేయ‌బోతున్నారు. ఇది ఇటీవ‌లే రేష్మి కూడా ప్ర‌క‌టించింది. ఆ సినిమా త‌ర్వాత పెండ్లి చేసుకోవ‌చ్చున‌నే సూచాయిగా వెల్ల‌డించింది. 
 
ఇదిలా వుంటే, సుధీర్ బ‌య‌ట‌కు వ‌స్తే మిగిలిన ఇద్ద‌రు గెటప్ శ్రీను, రాంప్రసాద్ కూడా వ‌స్తార‌నే వార్త కూడా వినిపిస్తోంది. సుధీర్ హీరో అయితే వీరిద్ద‌రు కూడా మంచి పాత్ర‌ల‌ను పోషించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆడ‌పా ద‌డ‌పా జ‌బ‌ర్ ద‌స్త్ చేయాలంటే కుద‌రదు గ‌నుక అగ్రిమెంట్ ముందుగా రాయాలి. అది ఈ ముగ్గురు గ‌త వారం రాయ‌లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments