Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల సుచిత్రా: పాటలు పాడకుండా ఈ పనులేంటి, ఈ భయాలేంటి?

వ్యక్తుల ప్రయివేట్ జీవితాలపైనే కాదు, పబ్లిక్ జీవితాలపైన కూడా హద్దు మీరి వ్యాఖ్యానిస్తే, అనవసరంగా తొంగి చూస్తే అప్పుడది సుచిత్ర అవుతుంది. ట్విట్టర్‌లో తోటి ప్రముఖ నటీనటుల రాసలీలలంటూ ఫొటోలు పెట్టి ఆ తర్వాత నాలుక కర్చుకోవడం ఎందుకు.. ఇప్పుడు ఇంట్లో కూడా

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (04:27 IST)
వ్యక్తుల ప్రయివేట్ జీవితాలపైనే కాదు, పబ్లిక్ జీవితాలపైన కూడా హద్దు మీరి వ్యాఖ్యానిస్తే, అనవసరంగా తొంగి చూస్తే అప్పుడది సుచిత్ర అవుతుంది. ట్విట్టర్‌లో తోటి ప్రముఖ నటీనటుల రాసలీలలంటూ ఫొటోలు పెట్టి ఆ తర్వాత నాలుక కర్చుకోవడం ఎందుకు.. ఇప్పుడు ఇంట్లో కూడా తనకు రక్షణ లేదని వాపోవడం ఎందుకు? బురదమీద కాలువేసినా, రాయి విసిరినా దాంట్లోంచి కొంత మనకు కూడా తగులుతుందని అర్థం కానంత అపరిణత తత్వంలో ఈ గాయని ఉందా? 

 
‘నా ప్రాణానికి ముప్పు ఉంది. ఇంట్లో కూడా రక్షణ లేదు’ అని గాయని, నటి సుచిత్ర పేర్కొన్నారు.  నటుడు ధనుష్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ట్వీటర్‌లో పేర్కొని తొలుత వివాదానికి తెరలేపిన సుచిత్ర.. తరువాత ధనుష్‌–త్రిష, అనిరుధ్‌–ఆండ్రియా, నటి హన్సిక ముగ్గురు యువకులతో రాసలీలల ఫొటోలను పోస్ట్‌ చేసి అలజడి సృష్టించారు. అనంతరం ఆ ఫొటోలను తాను విడుదల చేయలేదని, తన ట్వీటర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని పేర్కొన్నారు.
 
సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్‌ స్పందిస్తూ తన భార్య మానసికస్థితి సరిగా లేదని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఇంట్లో కూడా రక్షణ లేదని, ఎవరెవరో వచ్చి బెదిరిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి కాలింగ్‌బెల్‌ నొక్కి కాఫీ తీసుకొచ్చానని చెప్పి తలుపు తెరవమని బెదిరించాడని చెప్పారు. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్న తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. చెన్నై, ఎంఆర్‌సీ నగర్‌లో ఒక పబ్‌ ఉందని, అక్కడ కలుసుకునే ఒక ముఠా ఇదంతా చేస్తున్నారన్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments