సుచీ లీక్స్ దెబ్బకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ జనాలకు ముఖం చూపించలేని పరిస్థితి వచ్చినట్లే అనిపిస్తుంది. అతడికి సంబంధించి రోజుకో లీక్ ఇస్తూ గాయని సుచిత్ర రచ్చరచ్చ చేసేసింది. ఐతే ఈ వీడియోలను ట్విట్టర్ ఖాతాల నుంచి డిలిట్ చేసినప్పటికీ, అప్పటి
సుచీ లీక్స్ దెబ్బకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ జనాలకు ముఖం చూపించలేని పరిస్థితి వచ్చినట్లే అనిపిస్తుంది. అతడికి సంబంధించి రోజుకో లీక్ ఇస్తూ గాయని సుచిత్ర రచ్చరచ్చ చేసేసింది. ఐతే ఈ వీడియోలను ట్విట్టర్ ఖాతాల నుంచి డిలిట్ చేసినప్పటికీ, అప్పటికే డౌన్లోడ్ చేసేసుకున్న నెటిజన్లు వాటిని మళ్లీ రీ-అప్ లోడ్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా ధనుష్ పైన మరో సెటైరికల్ వీడియో అప్ అయ్యింది. ఆ వీడియోలో ధనుష్ అంటూ ఎవరో ఒక నటుడిపై పేరు రాస్తూ... అతడిపై ఉమ్మేసే సీన్లను జోడించారు. ఇలా ఉమ్మేయించుకునే నటుడిగా తమిళ నటుడు వడివేలు కనిపించి నవ్వులు తెప్పించాడు. మొత్తమ్మీద నటుడు ధనుష్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.