Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌ "కాలా" మూవీ ఫైట్ సీన్లు లీక్ (వీడియో)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఫైట్ సన్నివేశం ఒకటి లీక్ అయింది.

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (12:44 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఫైట్ సన్నివేశం ఒకటి లీక్ అయింది. ఈ పోరాట సన్నివేశం ఎడిటింగ్ టైంలోనే ఇది బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. దీంతో మ‌రోసారి ఈ లీకేజ్ జ‌ర‌గ‌కుండా చిత్ర యూనిట్ ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. 
 
ముంబైలోని తమిళనాడుకు చెందిన ఓ దాదా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై రజనీ అల్లుడు ధనుష్ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల కానుందని చిత్ర బృందం రీసెంట్‌గా ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి సబంధించిన ఓ వీడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
కాగా, పా. రంజిత్ దర్శకత్వంలో గతంలో వచ్చిన కబాలి చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన విషయం తెల్సిందే. అదేసమయంలో ఆరు పదుల వయసులో కూడా రజనీకాంత్ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వెండితెరపై ఇరగదీస్తున్నాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments