Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా నాయుడు లాంటి కథలు సినిమాల్లో చేయడం కష్టం

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (18:49 IST)
Rana-venkatesh
బాబాయ్ అబ్బాయ్ వెంకటేశ్‌ దగ్గుబాటి, రానా దగ్గుబాటి తండ్రీకొడుకులుగా తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రానా నాయుడు’. ఇందులో వెంకటేశ్‌ నాగ నాయుడు, రానా.. రానా నాయుడు పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి కొడుకుల వార్ బ్యాగ్ డ్రాప్ లో సాగే హై ఆక్టేన్, హై ఎనర్జీ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా సాగే ఈ ప్రాజెక్ట్ ని సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలైన ‘రానా నాయుడు’ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలని పెంచింది. మార్చి 10న ‘రానా నాయుడు’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ కానున్న నేపద్యంలో హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, సుందర్ ఆరోన్, సుపర్ణ్ వర్మ  కరుణ్ అన్షుమాన్ ‘రానా నాయుడు’ విశేషాలని పంచుకున్నారు.
 
ఇందులో సెలబ్రిటీ ఫిక్సర్ గా కనిపిస్తున్నారు కదా.. అసలు సెలబ్రిటీ ఫిక్సర్ అంటే ఏమిటి  ?
 రానా:  ఈ షోలో రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు సెలబ్రిటీలకు ఏ సమస్య వున్నా రానాకి ఫోన్ చేస్తారు. ఎవరితో షేర్ చేసుకోలేని విషయాలు నాతో షేర్ చేసుకుంటారు.
 
నాగ నాయుడు పాత్ర చేయడం ఎలా అనిపించింది ?
 వెంకటేష్ : ఒక నటుడిగా కొత్త పాత్రలు చేయాలని వుంటుంది. రానా నాయుడు లో కొత్త చేయడానికి చాలా స్కోప్ దొరికింది. ఇలాంటి పాత్రని గతంలో ఎన్నడూ చేయలేదు. నా వరకూ ఇది చాలా కొత్తగా వుంటుంది.
 
 ఇందులో సవాల్ గా   అనిపించిన అంశం ఏమిటి ?
రానా:  రానా నాయుడు లో ఒక డిస్ ఫంక్షనల్ ఫ్యామిలీ వుంటుంది. అలాంటి ఫ్యామిలీ గురించి ఎప్పుడూ విని ఉండము. ప్రతి ఒక్కరితో ఒక ప్రాబ్లం వుంటుంది. డార్క్ ఫ్యామిలీ. వాళ్ళు చేసే పను బయటికి చెప్పుకునేలా వుండవు. ఇంత మ్యాడ్ నెస్ లో కూడా ఫ్యామిలీ అనే ఎమోషన్ వుంటుంది. ఇలాంటి కథలు సినిమాల్లో చేయడం కష్టం. సిరిస్ లో చేయడం కుదిరింది. ముంబైలో వుండే ఒక సౌత్ ఇండియన్ కథ ఇది. హైదరాబాద్ ల్ వున్న ఓ కుటుంబం ముంబై వెళ్లి అక్కడ గ్యాంగ్ స్టార్ పనులు చేస్తే ఎలా వుంటుందో అనే ఆసక్తికరమైన అంశాలు ఇందులో వుంటాయి. నిజంగా ఇదొక ప్రయోగాత్మకమైన ప్రయత్నం.
 
కరణ్, సుపర్ణ్ వర్మ లతో పని చేయడం ఎలా అనిపించిది ?
 వెంకటేష్ : కరణ్,  సుపర్ణ్ వర్మ లతో గ్రేట్ జర్నీ. ఓటీటీ లో చేయడం ఇదే మొదటిసాటి. బిగినింగ్ నుంచి ఎంతో గైడింగ్ వున్నారు. పది ఎపిసోడ్ లు వున్నాయి. మార్చి 10 నుంచి మీరంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. నాగా నాయుడు పాత్ర లో చాలా షేడ్స్ వున్నాయి. ఇలాంటి షేడ్స్ వున్న పాత్రని ఎప్పుడూ చూడలేదు. ఎమోషనల్ సీన్స్ చాలా కొత్తగా పవర్ ఫుల్ గా వుంటాయి.
 
కరణ్, సుపర్ణ్ మాట్లాడుతూ... వెంకటేష్ గారు, రానా గారితో పని చేయడం ఆనందంగా వుంది. రానా నాయుడు చాలా డిఫరెంట్ షో. ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ కొత్తగా వుంటాయి. ప్రేక్షకుకులు ఖచ్చితంగా చాలా ఎక్సయిట్ అవుతారు’’ అన్నారు. 
 
 సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి,  రాజేష్ జైస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న సమిష్టి తారాగణం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ కలిగిస్తోందని భరోసా ఇచ్చింది.
 
రానా నాయుడు మార్చి 10, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments