Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ చెత్త సినిమాను ఆపేయండి, సిఎం జగన్ నిర్ణయం ఏంటి? పప్పుపై గొడవెందుకంటున్న వర్మ

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (21:28 IST)
కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమా కాస్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. సంచలనాల కోసమే రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కో రాజకీయ నాయకుడి గురించి, కొన్ని పార్టీల గురించి రాంగోపాల్ వర్మ చిత్రీకరించిన సినిమాలు పెను దుమారాన్నే రేపాయి..రేపుతున్నాయి.
 
అయితే తాజాగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు. రెండు ప్రధాన పార్టీలను ఇందులో తీసుకున్నారు వర్మ. అది కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల గురించి ప్రస్తావించడమే కాకుండా ఆ పార్టీ ముఖ్య నేతలను ఆ క్యారెక్టర్లో పెట్టారు. ఇంకేముంది ఎపిలో రాజకీయం మొత్తం ఆ సినిమావైపే తిరుగుతోంది.
 
ఇలాంటి నేపథ్యంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. సినిమాలో ఒక క్యారెక్టర్ పప్పు వడ్డించడానికి వెళుతుంది. ఆ ఒక్క సీన్‌ను వైసిపి నేతలు తమ గ్రూప్‌లో బాగా షేర్ చేశారు. వాట్సాప్‌లో ఆ ఒక్క సీన్ బాగా వైరల్ అయ్యింది. వడ్డించే వ్యక్తి చంద్రబాబు.. వడ్డించింది పప్పు. అదే... నారా లోకేష్‌ను ముద్దుగా పప్పు అని వైసిపి నేతలు పిలుస్తుంటారు. దీంతో ఇది కాస్త రాంగోపాల్ వర్మ సినిమాలో చర్చకు దారితీస్తోంది.
 
ఇదే విషయంపై రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. లోకేష్‌‌ను పప్పు అని పిలుస్తారని నాకు తెలియదు. పప్పు వడ్డించడం తప్పేందో నాకర్థం కావడం లేదు. నా సినిమా నా ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ద్వంద్వార్థాలు తీస్తున్నారు. మరికొందరు వారి స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు. సమాజం ఎలాపోతే నాకేంటి.. ఎవరు నన్ను విమర్సిస్తే నాకేంటి.. నాకు ఇష్టమొచ్చినట్లు సినిమా తీస్తానంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాను రిలీజ్ కానివ్వకుండా అడ్డుకునేందుకు రెండు పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీపైనే వర్మ సెటైర్లు వేసే విధంగా సినిమా తీయడాన్ని సిఎం తప్పుబడుతున్నట్లు భోగట్టా. ఇప్పటికే వర్మ ఒక విషయాన్ని ప్రకటించారు. తన సినిమాను రిలీజ్ చేయకుంటే యు ట్యూబ్‌లో రిలీజ్ చేసుకుంటానని ప్రకటించాడు. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... ప్రముఖుల విషెస్

మీ పెద్దమ్మాయి వద్దు.. చిన్నామ్మాయి కావాలి.. వరుడు కండిషన్!!

రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments