Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 2 వెంటనే ఆపేయండి.. సొసైటీకి ఏమాత్రం పనికిరాని?

బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభమై 73 ఎపిసోడ్‌లు పూర్తికాగా.. ఈ సీజన్‌లోనే మోస్ట్ బోరింగ్ తలనొప్పి ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి వేడుక అంటూ రాధాక్రిష్ణ, మధులత అనే రెండు బొమ్మలకు పెళ్లి

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (15:15 IST)
బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభమై 73 ఎపిసోడ్‌లు పూర్తికాగా.. ఈ సీజన్‌లోనే మోస్ట్ బోరింగ్ తలనొప్పి ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి వేడుక అంటూ రాధాక్రిష్ణ, మధులత అనే రెండు బొమ్మలకు పెళ్లి చేయడం, మెహిందీ ఫంక్షన్, పెళ్లి, సంగీత్, శోభనం ఇలా పెళ్లి నాటకం పీక్స్‌కి చేరింది. అయితే ఎపిసోడ్ ప్రేక్షకులను తెగ బోర్ కొట్టించింది.
 
కాగా బిగ్ బాస్ సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో మసాలా కొంచెం ఎక్కువైంది. ఈ షోకి ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కిందో అదే రేంజ్‌లో విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ ఈ షోని వెంటనే ఆపేయాలంటూ మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించారు. బిగ్ బాస్ ప్రోగ్రామ్ పేరుతో 16 మందిని ఒకే ఇంట్లో బంధించి సొసైటీకి ఏమాత్రం పనికిరాని విషయాలను ప్రసారం చేస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. 
 
ఈ షోతో కొందరి మనోభావాలు దెబ్బ తింటున్నాయని, కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విధంగా బిగ్ బాస్ ఉంటోందని లాయర్ భాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తోన్న ఈ షోని వెంటనే నిలిపివేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్, షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments