Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ రియాల్టీ షో లవర్స్‌కు షాక్.. షోను ఆపేస్తారా?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:44 IST)
బిగ్ బాస్ రియాల్టీ షో లవర్స్‌కు షాకైన ఘటన. బిగ్ బాస్ షో ఆపేస్తున్నారంటూ బుల్లితెర వర్గాల్లో టాక్ వస్తోంది. స్టార్ మా ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందంటున్నారు. 
 
స్టార్ మా బిగ్ బాస్ షో కోసం భారీగా ఖర్చు చేస్తుంది. కోట్లు ఖర్చుపెట్టి అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద హౌస్ సెట్ వేస్తారు. ఇక కంటెస్టెంట్స్, హోస్ట్ రెమ్యూనరేషన్ రూపంలో భారీగా చెల్లిస్తుంది. అలాగే మిగతా ఈవెంట్స్ పక్కన పెట్టి ప్రైమ్ టైంలో ప్రసారం చేస్తున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా దారుణమైన టీఆర్పీ రాబడుతుంది. కనీసం సీరియల్స్‌తో కూడా పోటీపడలేకపోతుంది. 
 
బిగ్ బాస్ ఎపిసోడ్స్ కి కేవలం 2 నుండి 2.5 రేటింగ్ మాత్రమే వస్తుందట. వీకెండ్ ఎపిసోడ్స్‌కు కూడా ఇదే పరిస్థితి. వీకెండ్స్ లో బిగ్ బాస్ 6 రేటింగ్ 3 నుండి 3.5 గా ఉంటుందట. కొన్ని పాప్యులర్ సీరియల్స్ 10 టీఆర్పీ ఈజీగా తెచ్చుకుంటుంటే… బిగ్ బాస్ దారుణంగా కనీసం అందులో సగం రాబట్టలేకపోతుంది. అందుకే ఈ షోను ఆపేయాలని నిర్వాహకులు అనుకుంటున్నారని తెలిసింది. 
 
మొత్తానికి బిగ్ బాస్ 6 మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇకపోతే.. 21 మంది కంటెస్టెంట్స్‌తో షో మొదలైంది. రెండవ వారం షాని, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. మూడవ వారం నేహా చౌదరి హౌస్ నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

యువతిని పొట్టనబెట్టుకున్న పెద్దపులి.. పొలాల్లో పనిచేస్తుండగా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments