Webdunia - Bharat's app for daily news and videos

Install App

Puneet Rajkumar బాధ‌తో రాస్తున్నామంటున్న స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (21:20 IST)
Vijay Devarakonda, Puneet Rajkumar
పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాత్మ‌ర‌ణం తెలుగు సినీమా రంగాన్ని క‌దిలించింది. ఈరోజు జ‌ర‌గాల్సిన సినిమా ఫంక్ష‌న్లు ష‌డెన్‌గా పోస్ట్‌పోన్ చేసుకున్నారు. నాట్యం, వ‌రుడుకావ‌లెను సినిమాల‌కు సంబంధించిన స‌క్సెస్ మీట్‌ల‌ను వారు వాయిదా వేసుకున్నారు. 
 
మ‌హేష్ బాబు 
 
మ‌హేష్ బాబు, పునీత్‌తో వున్న ప‌రిచ‌యాన్ని గుర్తుచేసుకున్నారు. పోకిరి సినిమా వేడుక‌లో మ‌హేష్ బెంగుళూరులో వున్న‌ప్పుడు పునీత్‌తో పంచుకున్న విష‌యాలు గుర్తుచేసుకున్నారు. పునీత్ మ‌ర‌ణం బాధ క‌లిగించింది.

 
అల్లు అర్జున్
అల్లు అర్జున్, పునీత్‌తో గ‌ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ వేడుక‌లో ఆయ‌న‌తో పాటు క‌లిసి కూర్చున్న‌ప్పుడు ఎన్నో విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. మంచి హృద‌యం గ‌ల వ్య‌క్తి పునీత్‌. ఇలా ఆయ‌న గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌నుకోలేదు.

 
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 
మీతో నేను గడిపిన సమయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అన్నా. నేను చాలా విచారంతో వ్రాస్తున్నాను. మీరు నాపై ద‌య చూపించిన విధానం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను.అంటూ,, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పునీత్‌ను 2018లో క‌లిసిన సంద‌ర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఫొటో పోస్ట్ చేశారు.

 
భ‌గ‌వంతుడి చిన్న‌చూపు చూశాడుః రోజా 
ఇక మ‌రోవైపు న‌టి రోజా కూడా పునీత్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని నెమ‌రేసుకున్నారు. ఓ చిన్న‌వీడియోను ఆమె పోస్ట్ చేశారు. అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమా క‌న్న‌డ‌లో మౌర్య‌లో న‌టించాడు. త‌ల్లి పాత్ర వేశాన‌నీ, ఆ సంద‌ర్భాన్ని గుర్తుచూస్తూ, అంద‌రితో స‌ర‌దాగా వుండేవాడు. స‌న్నిహితంగా వుండేవారు.


వ్యాయామం చేస్తూ రిలాక్స్ అయిన టైంలో చ‌నిపోయాడంటే ఆశ్చ‌ర్యం వేసింది. సౌత్ ఇండియా బాధ‌ప‌డే విష‌యం. పునీత్‌గారు ఎన్నో సేవ‌లు చేస్తున్నారు. 25 అనాథాశ్ర‌మాల‌ను, 1800 పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్నారు. ఇంకా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేసి ఎంతో మందికి వెలుగు నింపిన ఆయ‌న క‌నుమ‌రుగు కావ‌డం భ‌గ‌వంతుడి చిన్న‌చూపు చూశాడ‌ని.. సంతాపం తెలిపారు.

 
షాక్‌కు గుర‌య్యాః పూరీ జ‌గ‌న్నాథ్‌
ఎంతోమంది సాయం చేశాడు పునీత్‌. రాజ్‌కుమార్ లేరు. పార్వ‌త‌మ్మ‌గారు లేరు. ఇప్పుడు పునీత్ గారు లేరంటే త‌ట్టుకోలేక‌పోతున్నా. చిన్న వ‌య‌స్సులో కాలం చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం. నెల‌క్రిత‌మే మాట్లాడుకున్నాం. మ‌రోసారి కలుద్దాం అనుకున్నాం. కానీ ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదు. పునీత్ మ‌ర‌ణం క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర న‌ష్టం.

 
కోటి సంగీత ద‌ర్శ‌కుడు
పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం దిగ్బ్రాంతి క‌లిగించింది. క‌న్న‌డ‌తోపాటు తెలుగు ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని షాక్‌.

 
 సీనియ‌ర్ న‌రేశ్‌, మంచు విష్ణు సంతాపం
శివ‌రాజ్ కుమార్ నా క్లాస్‌మేట్పు. ఆయ‌న సోద‌రుడు పునీత్ నాకు బాగా తెలుసు. ఇలా షాకింగ్ న్యూస్ రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ త‌ర‌ఫున నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఇదే అభిప్రాయాన్ని మంచు విష్ణు వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments