కోలీవుడ్ హీరో ధనుష్‌కు సంబంధించి మరో షాకింగ్ విషయం లీకైంది. ధనుష్ కొత్త ఇంటిని కట్టుకుంటున్నారట. భార్యాభర్తలు ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని గడిపిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక.. ధనుష్ తన కోసం సపరేటుగా ఓ పెద్ద బంగ్లాని కట్టించుకోబోతున్నారట.
ప్రస్తుతానికి ధనుష్ హోటల్‌లోనే బస చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కట్టిస్తున్న ఇల్లు పూర్తి అయిన వెంటనే అక్కడికి షిఫ్ట్ అవుతారట. ఈ ఇంటికోసం ధనుష్ సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదే నిజమైతే రూ.300 కోట్ల రూపాయల ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ధనుష్ రికార్డు సృష్టించడం ఖాయం. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఇల్లు కట్టుకుంటే సరిపోదా.. అందులో దీపం పెట్టడానికి ఇళ్లాలు ఉండాలిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.