Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని హీరోగా 'మజ్ను'.. ప్రత్యేక పాత్రలో దర్శక ధీరుడు రాజమౌళి?

నాని హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' తర్వాత అదే సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ను రిపీట్‌ చెయ్యడానికి సంగీత దర్శకుడు గోపీసుందర్‌ సారథ్యంలో 'మజ్ను' పాటలు రూపొందాయి.

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (17:39 IST)
నాని హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' తర్వాత అదే సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ను రిపీట్‌ చెయ్యడానికి సంగీత దర్శకుడు గోపీసుందర్‌ సారథ్యంలో 'మజ్ను' పాటలు రూపొందాయి. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌ నిర్మాణ సారథ్యంలో 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో గోళ్ళ గీత నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. 
 
ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను మంగళవారం రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు. కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. కెమెరా పనితనం, అత్తారింటికి దారేది, సోగ్గాడే చిన్ని నాయనా, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు చేసిన ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎస్సెట్స్‌ కాబోతున్నాయి. ఈ చిత్రం ద్వారా ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.
 
ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. 
 
నేచురల్‌ స్టార్‌ నానికి సెప్టెంబర్‌ బాగా కలిసొచ్చిన నెల. అతని మొదటి సినిమా 'అష్టా చమ్మా', 'భలే భలే మగాడివోయ్‌' చిత్రాలు సెప్టెంబర్‌లో రిలీజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. మళ్ళీ ఆ సెంటిమెంట్‌ని మరోసారి నిజం చేసేందుకు 'మజ్నుగా సెప్టెంబర్‌లోనే రాబోతున్నారు నాని. ఆగస్ట్‌ 26న ఈ చిత్రం ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాణ సారధ్యం: పి.కిరణ్‌, నిర్మాత: గోళ్ళ గీత, దర్శకత్వం: విరించి వర్మ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments