Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - చరణ్‌కి పోటీ ఇవ్వాలనే ఆమెను ఎంపిక చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (13:57 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సంచలన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు, చరణ్‌ అభిమానులే కాకుండా.. సినీ ప్రియులందరూ ఎదురు చూస్తున్నారు. 
 
ఇప్పుడు హైదరాబాద్‍‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను స్టార్ట్ చేసారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే... ఈ ఎపిసోడ్ తెరపై ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తుంది. ప్రత్యేకంగా అలియాను "ఆర్ఆర్ఆర్" హీరోయిన్‌గా ఎంపిక చేయడం వెనుక ఓ సీక్రెట్ ఉంది. అది ఏంటంటే... "ఆర్ఆర్ఆర్‌"లో ఎన్టీఆర్, చరణ్‌లాంటి అద్భుతమైన నటులు ఉన్నారు. అలాంటి వారికి పోటీ ఇచ్చి నిలబడాలంటే ఎక్స్‌ట్రీమ్లి టాలెంటెడ్ అయి ఉండాలి. ఆ టాలెంట్ అలియా భట్‌కి ఉంది. 
 
అందుకే ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాను అని రాజమౌళి అసలు విషయం బయటపెట్టారు. త్వరలోనే అలియా భట్ షూటింగ్‌లో జాయిన్ కానుందని సమాచారం. 'బాహుబలి' తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్ధాయిలో ఉన్నాయి. అయితే... ఎన్ని అంచనాలు ఉన్నప్పటికీ... 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు. మరి.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments