Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరి సమస్యకు బాహుబలి-2 సినిమాకు లింకా? కట్టప్పకు నష్టం లేదు: రాజమౌళి

కావేరి సమస్యకు బాహుబలి సినిమాకు సంబంధం లేదని టాలీవుడ్ దర్శకుడు, జక్కన్న రాజమౌళి అన్నారు. కావేరి నీటిజలాలను విడుదల చేయకపోవడంతో ఆ రాష్ట్రాన్ని గతంలో బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ ఏకిపారేశారు. దీం

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (15:00 IST)
కావేరి సమస్యకు బాహుబలి సినిమాకు సంబంధం లేదని టాలీవుడ్ దర్శకుడు, జక్కన్న రాజమౌళి అన్నారు. కావేరి నీటిజలాలను విడుదల చేయకపోవడంతో ఆ రాష్ట్రాన్ని గతంలో బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ ఏకిపారేశారు. దీంతో బాహుబలి సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలంటే.. సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో బాహుబలి సినిమా కర్ణాటకలో ప్రదర్శితం కాబోదని.. అలా రిలీజ్ అయితే మాత్రం థియేటర్లపై దాడి చేస్తామని వట్టాళ్ నాగరాజ్ నేతృత్వంలోని బృందం హెచ్చరిస్తోంది.
 
ఈ నేపథ్యంలో రాజమౌళి దీనిపై స్పందించారు. బాహుబలి సినిమాను కన్నడీగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగారు. బాహుబలితో పాటు గత 9 సంవత్సరాల్లో ఎన్నో సినిమాలు రిలీజైనాయని రాజమౌళి గుర్తు చేశారు. ప్రత్యేకంగా బాహుబలి-2ని మాత్రం అడ్డుకోవడానికి కారణం ఏంటని అర్థం కావట్లేదని తెలిపారు.
 
ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.. కావేరి అంశం సున్నితమైంది. దానికి బాహుబలికి ఎలాంటి సంబంధం లేదు. సత్యరాజ్ బాహుబలి సినిమాకు దర్శకుడో, నిర్మాత కాదనే విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు. ఈ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించకపోతే.. సత్యరాజ్‌కు ఎలాంటి నష్టం లేదని.. అయితే నిర్మాతలకే సమస్యలు ఎదుర్కొంటారని నిర్మాత షీబో అన్నారు. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్య కృష్ణ నటించిన బాహుబలి ది కన్‌క్లూజన్ ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శివాజీలా డిప్యూటీ సీఎం పవన్ ఫ్లెక్సీలు

అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్

వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు ఇక్కట్లు.. కడపలో కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పది మంది శిశువులు సజీవ దహనం

పుప్పల్ గూడ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. ఎవరికి ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments