Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి భేటీ

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (11:31 IST)
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమావేశమయ్యారు. రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి అంతర్జాతీయ వేదికలపై మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరూన్ చూశారు. ఆయనకు విపరీతంగా నచ్చడంతో  తప్పకుండా తన భార్యను కూడా చూడాలని సూచించారు. ఈ క్రమంలో కామెరూన్ - రాజమౌళి వీరిద్దరూ ఒకేచోట కలుసుకున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫోటోలను రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
 
అవతార్ దర్శకుడు తనతో 10 నిమిషాల సమయం వెచ్చించి, సినిమా గురించి చర్చిస్తారని అనుకోలేదంటూ పోస్ట్ చేశారు. "గ్రేట్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్‌ను చూశారు. ఆయన ఎంతో నచ్చడమే కాకుండా మరోమారు వీక్షించాలంటూ భార్య సూజీకి సూచించారు. "సర్ మీరు మాతో 10 నిమిషాల సమయం వెచ్చించి, మా సినిమా గురించి విశ్లేషిస్తారని అనుకోలేదు. మీరు చెప్పినట్టు నేను ప్రపంచంలోనే ముందు స్థానంలో ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు" అంటూ రాజమౌళి ట్విట్టర్‌లో కామెంట్స్ చేసి.. కామెరూన్‌తో ముచ్చటిస్తున్న ఫోటోలను సైతం పోస్ట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments