Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని నెగ్గించడానికి చిరంజీవి చాలా తగ్గారు : రాజమౌళి

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (12:06 IST)
మెగాస్టార్ చిరంజీవిపై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ను చాలా మంది రకరకాలైన మాటలు అన్నారన్నారు. కానీ, మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారు. చిరంజీవిగారు మీరు నిజంగా మెగాస్టార్. ఇంకా చాలా మందికి తెలియని విషయం ఇంకోటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో వచ్చిన జీవో కూడా చిరంజీవి గారే కారణం. ఆయన తెర వెనుక ఉండి అంతా నడిపించారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ పెద్దగానే ఉండాలనుకుంటారు. నేను మాత్రం ఆయనను ఇండస్ట్రీ పెద్దగానే భావిస్తాను. చిత్ర పరిశ్రమ అంతా ఆయనకు రుణపడి ఉంటుంది అని రాజమౌళి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. 
 
"ఆర్ఆర్ఆర్" చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ కర్నాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్‌లో శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక సాధారణ అభిమానిలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ, "ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సభా వేదిక నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమను గెలిపించడానికి చిరంజీవి చాలా తగ్గి మాట్లాడారని కొనియాడారు. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని గౌరవిస్తాను" అని రాజమౌళి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments