Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 ట్రయిలర్‌కి 10 కోట్ల హిట్లు: ఉప్పొంగిపోతున్న రాజమౌళి

ఈ జన్మకిది చాలు బాబో అన్నంతగా రాజమౌళికే పులకరింపు కలిగించిన బాహుబలి2 వీడియో ట్రైలర్ రోజురోజుకీ చరిత్ర సృష్టిస్తూనే ఉంది. వారం రోజులక్రితం యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ 100 మిలియన్‌లకు (పది కోట్లు) పైగా వ్యూస్‌ను సాధించింది.

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (07:32 IST)
ఈ జన్మకిది చాలు బాబో అన్నంతగా రాజమౌళికే పులకరింపు కలిగించిన బాహుబలి2 వీడియో ట్రైలర్ రోజురోజుకీ చరిత్ర సృష్టిస్తూనే ఉంది. వారం రోజులక్రితం యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ 100 మిలియన్‌లకు (పది కోట్లు)  పైగా వ్యూస్‌ను సాధించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కాదు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కూడా అనితర సాధ్యమైన ఫీట్ సాధించిన బాహుబలి ట్రయిలర్ రికార్డును సమీప భవిష్యత్తులో ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదని చిత్ర పరిశ్రమ పండితులు, విశ్లేషకులు ముక్తకంఠంతో శ్లాఘిస్తున్నారు.
 
ఇక చిత్ర దర్శకుడు రాజమౌళి అయితే ఆనందం అంబరమంటిన స్థాయిలో ఉప్పొంగిపోతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ స్థాయిలో ట్రైలర్ చూస్తారని అసలు ఊహించలేదని.. అభిమానులు దీన్ని సాధ్యం చేశారని ట్వీట్ చేశారు. ఆన్‌లైన్‌లో అత్యధికులు వీక్షించిన ట్రైలర్‌గా రికార్డులు సృష్టించిన 'బాహుబలి-2'.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ 26న సాయంత్ర ఆరున్నర గంటలకు 360 డిగ్రీస్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించనున్నట్లు రాజమౌళి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 4k రిజల్యూషన్‌తో అభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తుంది మూవీ యూనిట్. మరోవైపు దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతుంది. తొలిసారిగా ఓ సినిమా భారత్‌లో ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే ప్రథమం. 
 
ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments