Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న కుమారుడు ఆ రంగంలో అడుగుపెట్టబోతున్నాడట...?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:16 IST)
రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతున్నాడన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 'షోయింగ్ బిజినెస్' బ్యానర్‌పై కార్తికేయ చిత్రాలను నిర్మిస్తాడు. సంస్థ తొలి ప్రయత్నంగా ఆకాశవాణి అనే చిత్రాన్ని నిర్మించబోతోంది. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్‌లు రాయబోతున్నాడు. ఈ సినిమాకి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇది అతనికి తొలి చిత్రం. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా అదే టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రాబోతోంది. దాని పేరు కూడా ఆకాశవాణి. కాకపోతే దాని పూర్తి టైటిల్ 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం'. సతీష్ బత్తుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మర్రిమాకల మల్లికార్జున నిర్మిస్తున్నాడు. 
 
ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల పోస్టర్ విడుదల చేశారు. వీటి వలన జనాలలో కన్ఫ్యూజన్ రావచ్చు. ఇద్దరూ ఒకే టైటిల్ ఎందుకు పెట్టుకున్నారో వారికే తెలియాలి. ఇక 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం' టీజర్ పోస్టర్‌ని చూసినట్లయితే, నీడలో ఒక వ్యక్తి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. 'నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటో మీకు సభాముఖంగా చెప్పబోతున్నాను' అనే క్యాప్షన్‌ని కూడా పెట్టారు. మరి అతని ప్రాబ్లమ్ ఏంటో తెలియాలంటే టీజర్ చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments