Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా భళా తందనాన మే 6న విడుదల

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (16:56 IST)
Srivishnu, Katherine Theresa
ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’.  బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది.
 
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది.
 
కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.  
 
తారాగణం: శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments