Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప శ్రీవల్లికి క్రేజ్ తగ్గలేదుగా... ముంబై పోలీసులు కూడా..? (video)

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (18:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో అయితే 'పుష్ప' సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించింది. నార్త్ లో 'పుష్ప' ఫీవర్ తో జనాలు ఊగిపోయారు. ఇక సినిమాలోని సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి.  
 
శ్రీవల్లి సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. ఈ సాంగ్, ఇందులోని స్టెప్స్ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అయ్యాయి. నార్త్ లో ఈ పాట బాగా హిట్ అయింది. యూట్యూబ్ లో కూడా శ్రీవల్లి సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. 
 
చాలా మంది ఈ పాటకి కవర్స్ సాంగ్స్ కూడా చేశారు. సెలబ్రిటీలు సైతం ఈ పాటకి రీల్స్ చేశారు. తాజాగా ముంబై పోలీసులు కూడా 'పుష్ప' సినిమాలోని శ్రీవల్లి సాంగ్ ని రీక్రియేషన్ చేశారు. 
 
Mumbai Police
ముంబై పోలీసుల్లో స్పెషల్ ట్యాలెంట్ ఉన్న కొంతమందితో 'ఖాకీ స్టూడియో' అనే మ్యూజిక్ బ్యాండ్ ని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఖాకి స్టూడియోలో ఉన్న పోలీసులు 'పుష్ప' సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ని తమ వాయిద్య పరికరాలతో వినిపించారు.
 
ఈ మ్యూజిక్ బ్యాండ్ వాయించిన శ్రీవల్లి సాంగ్ ని తమ అధికారిక ముంబై పోలీసుల యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. అంతే కాక ముంబై పోలీస్ అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఈ పాటని మా ఖాకీ స్టూడియో ద్వారా అందరికి వినిపించాలనుకుంటున్నాము' అని పోస్ట్ చేశారు. 
 
ముంబై పోలీసులు ఎంతో అద్భుతంగా శ్రీవల్లి పాటని వాయించారు. ఇది చూసిన వారంతా పోలీసులని అభినందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు అయితే ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments