Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం

డీవీ
సోమవారం, 1 జులై 2024 (17:14 IST)
MLA Mal Reddy Ranga Reddy, Sriram, Shruti Menon
హీరో శ్రీరామ్ కొత్త మూవీ "కోడి బుర్ర" ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. మహావీర్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు.
 
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ - కోడి బుర్ర చిత్రాన్ని మా మిత్రులు నిర్మిస్తున్నారు. మంచి కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్రేక్షకుల్ని ఈ మూవీ ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. హీరో శ్రీరామ్, హీరోయిన్ శృతి మీనన్, నిర్మాతలైన నా మిత్రులు, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ - ఈ చిత్రంలో శ్రీరామ్ గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. కోడి బుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది. కోడి బుర్ర అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
 
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ - కోడి బుర్ర సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథతో మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా టైటిల్ వినగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వీ 4 క్రియేషన్స్ లో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ చంద్రశేఖర్ కు ఇది నాలుగో సినిమా. కోడి బుర్ర చిత్రాన్ని అందరికీ నచ్చేలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. శృతి మీనన్ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ఆరుషి మంచి రోల్ చేస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ మూవీలో పార్ట్ కావడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్. అన్నారు.
 
హీరోయిన్ శృతి మీనన్ మాట్లాడుతూ - నేను తమిళ, మలయాళంలో సినిమాలు చేశాను. కోడి బుర్ర చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో పరిచయం కావడం సంతోషంగా ఉంది. కోడి బుర్ర సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అన్నారు.
 
నిర్మాత గట్టు విజయ్ మాట్లాడుతూ - కోడి బుర్ర సినిమాను ఇవాళ లాంఛనంగా ప్రారంభించుకున్నాం. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. హీరో శ్రీరామ్ గారు ఈ కథ విన్న వెంటనే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. అలాగే శృతి, ఆరుషి హీరోయిన్స్ కనిపించనున్నారు. ఒక మంచి మూవీతో మీ అందరి ముందుకు త్వరలోనే వస్తాం. అన్నారు.
 
నిర్మాత కంచర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ - నా ఫేవరేట్ హీరో శ్రీరామ్ గారితో సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఆయన ఒకరికి ఒకరు, పోలీస్ పోలీస్ సినిమాలను చాలా సార్లు చూశాను. ఈ చిత్రాన్ని నా మిత్రులు గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాను. పేరున్న నటీనటులు మా చిత్రంలో నటించబోతున్నారు. మంచి కథ, మా డైరెక్టర్ గారు ఎంతో క్రియేటివ్ గా సినిమా స్క్రిప్ట్ చేశారు. కోడి బుర్ర సినిమా సక్సెస్ అయ్యి మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ - కోడి బుర్ర చిత్రంలో నాకు నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్. ఈ చిత్రం మా టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుంది. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటుడు మహావీర్ మాట్లాడుతూ - నేను మా డైరెక్టర్ చంద్రశేఖర్ చేసిన గత మూవీ రవికుల రఘురామలో విలన్ గా నటించారు. కోడి బుర్ర చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నాను. ఈ చిత్రానిక మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments