శ్రీముఖి, నవదీప్‌ కెమిస్ట్రీ బాగుందే.. పులిహోర కలుపుతూ..

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (17:03 IST)
srimukhi_navadeep
సంక్రాంతి కోసం సర్వం సిద్ధం అవుతున్నాయి. తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకునే ఈ సంక్రాంతి సందడి ఇప్పుడే మొదలైంది. ఇప్పటికే అందరూ తమ సొంత ఊళ్ల దారి పట్టారు. ఇక మరోవైపు సంక్రాంతి పండుగ రోజు వీక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లు పలు ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేశాయి. 
 
ఇందులో భాగంగా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జీ తెలుగులో సంక్రాంతి సంబరాలు పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ రానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కి శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరించనుంది. ఇక ఈ ప్రోగ్రామ్‌లో జీ తెలుగు సీరియల్స్‌లో నటించే నటీనటులు భాగం కానున్నారు. 
 
అలాగే జీ తెలుగు ప్రోగ్రామ్‌లు అయిన సరిగమప, అదిరింది(ఇటీవలే ముగిసింది) షోలో పాల్గొన్న వారు కూడా పాల్గొనగా.. హీరో నవదీప్, రామ్‌లు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. 
 
అందులో శ్రీముఖి, నవదీప్‌కి పులిహోర కలుపుతూ ఉంటుంది. ఇక శ్రీముఖి ప్రశ్నలకు అదిరిపోయే పంచులతో నవదీప్‌ సమాధానం ఇస్తాడు. చూస్తుంటే వీరి మధ్య కెమిస్ట్రీ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నట్లు తెలుస్తోంది. 
 
మరి ఈ ఇద్దరి మధ్య ఇంకెన్ని పంచ్‌లు పేలనున్నాయో తెలియాలంటే నాలుగు రోజులు ఆగాల్సిందే. అయితే ఈ ప్రోగ్రామ్‌ని సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13, 14 తేదీల్లో ప్రసారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments