Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డీవీ
శుక్రవారం, 22 నవంబరు 2024 (15:04 IST)
Srileela, Allu Arjun
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం 'పుష్ప-2' ది రూల్‌. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ  చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా ప్రేక్షకుల్లో, ఐకాన్‌స్టార్‌ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ట్రైలర్‌ తరువాత సినిమాపై క్రేజ్‌.. అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
 
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నట విశ్వరూపం డిసెంబరు 5న ప్రపంచమంతా చూడబోతుంది. బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌... కల్డ్‌ మాస్‌ మేకింగ్‌ గురించి మాట్లాడుకోబోతున్నారు. ఇక ఈ చిత్రంలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక పాట అప్‌డేట్‌ వచ్చేసింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలపై చిత్రీకరించిన ఈ పాటను ఈ నెల 24న చెన్నయ్‌లో జరగనున్న గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ కిస్సిక్‌ సాంగ్‌ను   గ్రాండ్‌గా ఏడు గంటల రెండు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు. ఒకవైపు ఐకాన్‌ స్టార్‌ డ్యాన్సుల గురించి, డ్యాన్సుల్లో ఆయన ఎనర్జీ, ఈజ్‌, స్టయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
మరో వైపు  డ్యాన్సుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కథానాయిక శ్రీలీల ఈకాంబోలో ప్రత్యేక గీతం అంటే ఇక ఫ్లోర్‌ ఫైరే... ఈ సాంగ్‌ పుష్ప-2లో మరో సన్సేషన్‌ సాంగ్‌గా నిలవబోతుంది. ఈ ఇద్దరి డ్యాన్సింగ్‌ ఫైర్‌కు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు తోడైతే.. ఇక మాస్‌.. మాస్‌ జాతరే.. రెడీ టూ వాచ్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మాస్‌ సాంగ్‌. మాస్‌ మ్యూజికల్‌ బొనాంజ..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments