Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

దేవీ
సోమవారం, 24 మార్చి 2025 (08:28 IST)
Srikanth look as Britisher
హీరో సాయి దుర్గ తేజ్ చిత్రం సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్‌ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సాయి దుర్ఘ తేజ్‌ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు. బ్లాక్‌బస్టర్ హనుమాన్‌తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. ఈ రోజు శ్రీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా విషెష్ అందిస్తూ మేకర్స్ శ్రీకాంత్ ని బ్రిటిషు పాత్రలో పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రగ్గడ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ కోట్ ధరించి ఫెరోషియస్ గా కనిపించిన శ్రీకాంత్ లుక్ వుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇప్పటికే విడుదలైన కార్నేజ్ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సంబరాల యేటిగట్టు చుట్టూ ఉన్న బజ్  నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.
 
సంబరాల యేటిగట్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్‌తో సంబరాల యేటిగట్టు సాయి దుర్గ తేజ్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.
 
 ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో అద్భుతమైన టెక్నికల్ టీం పని చేస్తోంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు  
 
ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments