Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాంత్ కుమారుడు హీరోగా పెళ్లి సందడి : దర్శకుడు ఎవరంటే...?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (11:19 IST)
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా వెండితెరకు పరిచయమై ఉన్నాడు. గతంలో వచ్చిన నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా రోషన్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే, అది ఎటూ కాని వయసు కావడంతో ఆ తర్వాత గ్యాప్ తీసుకుని, నటనలో సంపూర్ణమైన శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా 'పెళ్లిసందడి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  
 
పెళ్లి సందడి చిత్రం గత 1996లో వచ్చింది. శ్రీకాంత్ హీరోగా నటించగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు నిర్మించిన దృశ్యకావ్యం. రవణి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లు. సి. అశ్వనీదత్, అల్లు అరవింద్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇది తెలుగునాట థియేటర్లలో ఎంతటి సందడి చేసిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.
 
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రాన్ని మళ్లీ అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా నాటి 'పెళ్లిసందడి' హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
 
ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాత కె.కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments