Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం శ్రీ ముఖలింగం ప్రత్యేకత తెలిపే శివ శక్తి పాట కాశీలో లాంచ్ కాబోతోంది

డీవీ
బుధవారం, 18 డిశెంబరు 2024 (14:12 IST)
Naga Chaitanya, Sai Pallavi
నాగ చైతన్య మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు, ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి ఇప్పటికే 30 M+ వ్యూస్ తో అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.
 
ఈరోజు, మూవీ సెకండ్ సింగిల్-శివశక్తిని డిసెంబర్ 22న కాశీలోని డివైన్ ఘాట్స్ లో లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే ఈ పాట సంగీతపరంగా, విజువల్ గా అద్భుతంగా వుండబోతోంది. పండుగను అత్యంత వైభవంగా జరుపుకునే అనుభూతిని అందిస్తామని మేకర్స్ వాగ్దానం చేశారు. ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 
 
శివ శక్తికి సంబంధించిన పోస్టర్ నాగ చైతన్య, సాయి పల్లవి పవర్ ఫుల్ శివ శక్తి ఫోజ్ లో కనిపించడం ఆకట్టుకుంది. చుట్టూ పెద్ద సంఖ్యలో జనసమూహం, వారి సంప్రదాయ వస్త్రధారణ జాతర ఉత్సాహపూరిత వాతావరణం పాట యొక్క ఆధ్యాత్మిక ఇతివృత్తానికి జీవం పోస్తాయి. ఈ పాటను భారీ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో చిత్రీకరించారు, ఇది ఇప్పటివరకు నాగ చైతన్య కు మోస్ట్ ఎక్సపెన్సీవ్ ట్రాక్‌గా నిలిచింది.
 
నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్. 
 తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments