Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చిరాతలు రాస్తారా? ఆ కారణం వల్లే శివగామిగా నటించలేదు: శ్రీదేవి

బాలీవుడ్ నటి శ్రీదేవికి దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి "బాహుబలి 2" చిత్రంలో ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను తిరస్కరించింది. రూ.6 కోట్ల పారితోషికంతో పాటు షూటింగ్ ఉన్న సమయంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేందుక

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (11:51 IST)
బాలీవుడ్ నటి శ్రీదేవికి దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి "బాహుబలి 2" చిత్రంలో ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను తిరస్కరించింది. రూ.6 కోట్ల పారితోషికంతో పాటు షూటింగ్ ఉన్న సమయంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేందుకు బిజినెస్ క్లాస్‌లో విమాన టిక్కెట్‌, నక్షత్ర హోటల్‌లో ఐదు లగ్జరీ సూట్‌లు ఇలా అనేక గొంతెమ్మ కోర్కెలు కావాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఈ చిత్రంలో శ్రీదేవికి వేయాల్సిన పాత్రను రమ్యకృష్ణ పోషించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించింది. దీంతో ఈ చిత్రంలో నటించేందుకు వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించి పెద్ద తప్పు చేశానని శ్రీదేవి పలువురి వద్ద వాపోయినట్టు వార్తలు వినిపించాయి. 
 
ఈనేపథ్యంలో ర‌వి ఉడ‌యార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన చిత్రం "మామ్". బోని క‌పూర్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జులై 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన శ్రీదేవిని ఓ విలేఖరి ఓ ప్రశ్న అడిగాడు. 'బాహుబ‌లి' చిత్రంలో శివ‌గామి పాత్ర‌ని రిజెక్ట్ చేయ‌డానికి కార‌ణాలేంట‌న్నది ఆ ప్రశ్న. 
 
దీనికి 53 ఏళ్ళ భామ త‌నదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ఇప్ప‌టివర‌కు నేను చాలా సినిమాలు నిరాకరించారు. వాటి గురించి ఎప్పుడు ఎవ‌రు అడిగిన దాఖ‌లాలు లేవు. బాహుబ‌లి రెండు పార్ట్‌లు తెర‌కెక్కి, విడుద‌లైన త‌ర్వాత కూడా ఆ ప్ర‌శ్న‌నే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారో అర్థం కావ‌డం లేదు. ఒక వేళ దానికి నేను స‌మాధానం చెప్ప‌కపోతే, ఎవ‌రికిన‌చ్చిన‌ట్టు వారు వార్తలు రాసేసుకుంటున్నారు. అస‌లు నేను శివ‌గామి పాత్ర‌ని చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం నా ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ అంటూ సింపుల్‌గా శ్రీదేవి తేల్చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments