నా కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన ధృవతార : జూనియర్ ఎన్టీఆర్

సినీ వినీలాకాశం నుంచి మరో ధృవతార నేలరాలింది. అతిలోకసుందరిగా జనం మదిలో నిలిచిపోయిన అందాల తార అస్తమించింది. బాల నటిగా, కథానాయికగా ఎన్నో మరపురాని పాత్రలు పోషించి, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న నటి శ్

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:23 IST)
సినీ వినీలాకాశం నుంచి మరో ధృవతార నేలరాలింది. అతిలోకసుందరిగా జనం మదిలో నిలిచిపోయిన అందాల తార అస్తమించింది. బాల నటిగా, కథానాయికగా ఎన్నో మరపురాని పాత్రలు పోషించి, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న నటి శ్రీదేవి శనివారం రాత్రి శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. 
 
తన మేనల్లుడి వివాహా వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన ఆమె.. అక్కడే తన తుది శ్వాస విడిచారు. ఆమె మరణించారు అనే విషయం.. సినీ ప్రముఖులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. అలాంటి అందాల తారను అభిమానించే అభిమానుల్లో టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 
 
తన తాత నందమూరి తారక రామారావుతో ఎన్నో మరపురాని సినిమాల్లో నటించిన శ్రీదేవి అంటే తారక్‌కు ఎనలేని అభిమానం. ఈ విషయాన్ని తారక్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు కూడా. ఏ ఇంటర్వ్యూ అయినా, మరే సందర్భంలో అయినా తన అభిమాన తార శ్రీదేవి అని చెప్పేవాడు తారక్. కుదిరితే ఆమెతో ఒక్క పాటలో అయినా చేయాలని పరితపించేవాడు. 
 
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'నాకు నచ్చిన హీరోయిన్ శ్రీదేవి.. అంతే... ఆమెకు వీళ్లెవరూ సాటిరారు. ఒక మాట. ఒక భార్య. ఒక బాణం అంటారు కదా. అలా నా మైండ్‌లో ఆమె ఫిక్స్‌ అయిపోయిందంతే. ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ. ఆమె అంటే నాకు పిచ్చి.. కానీ, ఆమె మనతో చేయరండి. ఎక్కడో ఓ చోట ట్రై చేయాలి. ఏదో ఒక సందర్భంలో కనీసం ఒక సాంగైనా... నా శక్తి మేరకు ట్రై చేస్తాను. కుదిరితే ఓకే' అంటూ ఎన్టీఆర్ తన మనసులోని మాటను వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments