Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనీ కపూర్‌ను అరెస్ట్ చేస్తారా? అప్పటిదాకా శ్రీదేవి భౌతికకాయం రాదా?

సినీతార, అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఎన్నో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్‌లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో శనివారం రాత్రి శ్రీదేవి కన్నుమూశారు. అయితే ఇప్పటివరకు శ్రీదేవి భౌతికకాయం దేశానికి చేరుకోలేదు.

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (08:58 IST)
సినీతార, అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఎన్నో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్‌లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో శనివారం రాత్రి శ్రీదేవి కన్నుమూశారు. అయితే ఇప్పటివరకు శ్రీదేవి భౌతికకాయం దేశానికి చేరుకోలేదు. శ్రీదేవి మృతివెనుక కారణాలు వెలికి తీస్తున్న పోలీసులు, దర్యాప్తు పూర్తయ్యేంతవరకు శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు పంపే అవకాశం లేనట్లు తెలుస్తోంది. 
 
కాగా ఇప్పటికే బోనీకపూర్‌ను విచారించిన పోలీసులు.. శ్రీదేవి మృతిపై నిజాలేంటనే దానిపై ఆరాతీస్తున్నారు. ఎంబాలింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అన్ని సందేహాలు తీరిన తరువాతే ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందిస్తామని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భారత రాయబార కార్యాలయానికి దుబాయ్ పోలీసులు సమాచారం అందించినట్లు వినికిడి.

ఇదిలా ఉంటే... ఈ నెల 20వ తేదీన తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహ నిమిత్తం.. శ్రీదేవి దుబాయ్‌కి వెళ్లింది. 24న రిసెప్షన్ పూర్తయ్యాక కూడా శ్రీదేవి ఒక్కతే దుబాయ్‌లో వుండిపోయింది. అలా శ్రీదేవి ఒంటరిగా దుబాయ్‌లో ఎందుకుండిపోయిందని బోనీ కపూర్ వద్ద దుబాయ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
మరోవైపు మంగళవారం కూడా బోనీ కపూర్‌ వద్ద మరోసారి విచారించి ఆయన పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో బోనీని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు దుబాయ్ మీడియా వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments